దుబాయ్ లో మద్యం ప్రియులకు కిక్ ఇచ్చిన ప్రభుత్వ నిర్ణయం!
- మద్యం విక్రయాలపై నిబంధనల సడలింపు
- మద్యంపై 30 శాతం పన్ను ఎత్తివేత
- పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు
గతంలో అరబ్ దేశాల్లో ఇంట్లో మద్యం సేవించాలన్నా కొంత డబ్బు చెల్లించి వ్యక్తిగత లైసెన్స్ తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు మద్యం విషయంలో చట్టాలను సవరిస్తూ జనవరి 1న దుబాయ్ రాజ కుటుంబం ఈ ప్రకటన చేసింది. విదేశీ పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు మద్యంపై ట్యాక్స్ తగ్గించింది. దుబాయ్ చట్టాల ప్రకారం.. ముస్లింలు మద్యం తాగడానికి వీల్లేదు. ఇతరులు మద్యం సేవించాలంటే వీసా కలిగి, 21 ఏళ్లు దాటిన వారై ఉండాలి. కానీ, ఇప్పుడు ఈ చట్టాలను సవరించడంతో పాటు మద్యం ధరలు కూడా తగ్గించింది. దాంతో, విదేశీ పర్యాటకులకు ఊరట కలుగుతుందని గల్ఫ్ దేశం భావిస్తోంది.