ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుదన్ను: టీడీపీ కార్యకర్తల మృతిపై పవన్ తీవ్ర విచారం
- చంద్రబాబు సభలో తొక్కిసలాటలో 8 మంది మృతి
- చాలా దురదృష్టకరమన్న పవన్ కల్యాణ్
- గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుదన్ను అని... అటువంటి కార్యకర్తలు ఇలా ప్రమాదం బారినపడి మృతి చెందడం ఎంతో విచారకరమని చెప్పారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. ఆసుపత్రిపాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు.