Maharashtra: మహారాష్ట్రలో దారుణం.. 16 ఏళ్ల బాలికపై 8 మంది అత్యాచారం!

8 Men Gangrape 16 Year Old Girl In Palghar
  • పాల్ఘర్ జిల్లాలో ఘటన
  • బాలికకు మాయమాటలు చెప్పి పాడుబడిన బంగ్లాలోకి తీసుకెళ్లిన బాలుడు
  • అక్కడ మరో ఏడుగురితో కలిసి అత్యాచారం
  • రాత్రి 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు అఘాయిత్యం
మహారాష్ట్రలో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలికపై 8 మంది అత్యాచారానికి ఒడిగట్టారు. ప్రస్తుతం నిందితులందరూ పోలీసుల అదుపులో ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పాల్ఘర్ జిల్లాకు చెందిన బాధిత బాలికను కలిసిన ఓ బాలుడు ఆమెకు మాయమాటలు చెప్పి సముద్ర తీర గ్రామంలోని ఓ ఖాళీ భవనంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అక్కడికి మరో ఏడుగురు నిందితులు వచ్చారు. అనంతరం అందరూ కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఆమెను సముద్రం ఒడ్డుకు తీసుకెళ్లి మరోమారు అత్యాచారానికి పాల్పడ్డారు.

రాత్రంతా వేధింపులు ఎదుర్కొన్న బాలిక ఉదయం ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడు సహా ఎనిమిది మందినీ అదుపులోకి తీసుకున్నారు. డిసెంబరు 16న ఈ ఘటన జరిగిందని, దాదాపు రాత్రి 8 గంటల సమయంలో బాలికపై మొదలైన లైంగిక దాడి తర్వాతి రోజు ఉదయం 10 గంటల వరకు కొనసాగిందని పోలీసులు తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Maharashtra
Palghar
Gang Rape
Sexual Assault

More Telugu News