Gareth Wynn Owen: టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్

  • తెలుగు రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గా గారెత్ విన్ ఓవెన్
  • ఇటీవలే బాధ్యతల స్వీకరణ
  • చంద్రబాబుతో మర్యాదపూర్వక సమావేశం
UK Deputy High Commissioner Gareth Wynn Owen met TDP Chief Chandrababu

తెలుగు రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ నేడు టీడీపీ అధినేత చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబుతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. భారత్, బ్రిటన్ దేశాల మధ్య సంబంధాలు, జీ-20కి భారత్ నాయకత్వం తదితర అంశాలు వీరిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. ఈ భేటీ సందర్భంగా చంద్రబాబు... గారెత్ విన్ ఓవెన్ ను శాలువా కప్పి సన్మానించారు. 

గారెత్ విన్ ఓవెన్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గా ఇటీవలే బాధ్యతలు అందుకున్నారు. ఆయనకు ముందు ఆండ్రూ ఫ్లెమింగ్ ఈ బాధ్యతలు నిర్వర్తించారు.

More Telugu News