హుస్సేన్ సాగర్ తీరంలో కార్ రేసింగ్ కు విచ్చేసిన రామ్ చరణ్, ఉపాసన
- హైదరాబాదులో ఇండియన్ రేసింగ్ లీగ్
- నేటితో ముగిసిన పోటీలు
- విజేతగా నిలిచిన కొచ్చి టీమ్
- హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ కు సెకండ్ ప్లేస్
కాగా, ఈ కార్ రేసింగ్ పోటీలను తిలకించేందుకు టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ సతీసమేతంగా విచ్చేశారు. రామ్ చరణ్, ఉపాసన రేసింగ్ పోటీలను ఉత్సాహంగా తిలకించారు. ఓ రేస్ కారు పక్కన నిల్చుని ఫొటోలకు పోజులిచ్చారు.
యువ హీరో అక్కినేని నాగచైతన్య కూడా ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలను ఆస్వాదించారు. హుస్సేన్ సాగర్ తీరంలో 2.7 కిమీ మేర ప్రత్యేకంగా రేసింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం తెలిసిందే. ట్రాక్ పొడవునా వివిధ ప్రాంతాల్లో వీక్షకుల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు.

