మహారాష్ట్ర మంత్రిపై ఇంకు దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
- స్కూళ్లు, కాలేజీల కోసం నిధులు ‘అడుక్కోవాలన్న’ మంత్రి
- నల్లజెండాలతో నిరసన తెలిపే యత్నం
- మంత్రి వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారన్న ఫడ్నవీస్
శుక్రవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. విద్యాలయాల అభివృద్ధి కోసం అప్పట్లో అంబేద్కర్, జ్యోతిరావు పూలే ప్రభుత్వ నిధులను అడగలేదని అన్నారు. పాఠశాలలు, కళాశాలలను ప్రారంభించాలంటే ప్రజలంతా ఒక్కటై నిధులు అడుక్కోవాలని అన్నారు. ‘అడుక్కోవాలి’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీంతో స్పందించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. మంత్రి వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ప్రజలే నిధులు సమకూర్చుకోవాలని చెప్పడమే ఆయన ఉద్దేశమని వివరణ ఇచ్చారు.