ఆయన ఇక్కడ ఎమ్మెల్యే కావడం మన దురదృష్టం: టీఆర్ఎస్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి
- భుంపల్లి మండలం ఆయన వల్లే వచ్చిందని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారన్న ప్రభాకర్ రెడ్డి
- హైవేలు కూడా ఆయనే తెచ్చినట్టు చెప్పుకుంటున్నారని మండిపాటు
- అబద్ధాల యూనివర్శిటీకి ఆయనే వైస్ ఛాన్సలర్ అని ఎద్దేవా
నేషనల్ హైవేలకు, ఎమ్మెల్యేలకు ఏమైనా సంబంధం ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. అబద్ధాల యూనివర్శిటీ ఉంటే దానికి రఘునందన్ వైస్ ఛాన్సలర్ అవుతారని ఎద్దేవా చేశారు. మొన్న ఉప ఎన్నికలో ఏదో పొరపాటు జరిగి ఆయన గెలిచారని... మరోసారి అలాంటి పొరపాటు జరగకుండా మనం చూసుకోవాలని అన్నారు.