రాజమౌళిపై అమెరికా మీడియాలో కథనం
- బాహుబలితో అంతర్జాతీయ స్థాయికి రాజమౌళి
- ఆర్ఆర్ఆర్ తో మరింత పేరుప్రఖ్యాతులు
- ఇటీవల గవర్నర్ అవార్డులకోసం అమెరికా వెళ్లిన జక్కన్న
- రాజమౌళి ముంగిట భారీ అవకాశాలు అంటూ పత్రికా కథనం
కాగా, ఆస్కార్ అవార్డులకు ముందు ప్రదానం చేసే గవర్నర్ అవార్డుల కార్యక్రమం కోసం రాజమౌళి ఇటీవల అమెరికా వెళ్లారు. ఈ నేపథ్యంలో, అమెరికా మీడియాలో రాజమౌళిపై కథనం రావడం విశేషం.
ప్రఖ్యాత లాస్ ఏంజెలిస్ టైమ్స్ పత్రిక 'ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ ముంగిట భారీ అవకాశాలు' అంటూ రాజమౌళిపై కథనం ప్రచురించింది. ఎస్ఎస్ రాజమౌళి అమెరికన్ యాక్షన్ సినిమాలు చూస్తూ పెరిగాడని, ఇప్పుడు యావత్ అమెరికా రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ చిత్రం చూస్తూ ఊగిపోతోందని తన కథనంలో పేర్కొంది. రాజమౌళిపై లాస్ ఏంజెలిస్ టైమ్స్ లో కథనం రావడం పట్ల అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు.