ఆ పోస్టర్ లో ఉన్నది జనసేన గ్లాసు కాదు: అడివి శేష్
- అడివి శేష్ హీరోగా హిట్-2 చిత్రం
- నిన్న ట్రైలర్ విడుదల
- చేతిలో టీ గ్లాసుతో అడివి శేష్ పోస్టర్
- జనసేన గ్లాసులా ఉందంటూ ప్రశ్నించిన మీడియా
శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్-2 చిత్రం గతంలో వచ్చిన హిట్ సినిమాకు సీక్వెల్. హిట్-2 చిత్రం డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. విశాఖలో ఓ యువతి హత్య కేసు ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.