Krishnavamsi: సిక్సులే కాదు .. డకౌట్స్ కూడా చూశాను: కృష్ణవంశీ

Krishnavamsi Interview
షార్ట్స్‌లో చూడండి
కృష్ణవంశీ పేరు వినగానే ఆయన నుంచి వచ్చిన 'గులాబీ' .. 'నిన్నే పెళ్లాడుతా' .. 'సిందూరం' .. 'అంతఃపురం' .. 'ఖడ్గం' వంటి సినిమాలు కళ్లముందు కదలాడతాయి. ఆ సినిమాలన్నీ కూడా ఒకదానికి మించి ఒకటి భారీ విజయాలను `సాధించాయి. అలాంటి గొప్ప సినిమాలను తెరకెక్కించిన కృష్ణవంశీ, తాజా ఇంటర్వ్యూలో తనదైన శైలిలో సమాధానాలిస్తూ వెళ్లారు. 

"నా సినిమాల్లో ఏది బెస్టు అంటే నేను చెప్పలేను. కెరియర్ ఆరంభంలో హిట్ వస్తే గర్వంగా ఉండేది. ఆ తరువాత మనదేమీ లేదు అనే విషయం అర్థమైంది. ఇంకొంత కాలం పోయిన తరువాత, ఆ సమయానికి అలా జరిగింది అంతే అనిపించింది.  అందమైన అమ్మాయి కనిపించినప్పుడు, 'బాపుగారి బొమ్మలా ఉంది .. కృష్ణవంశీ సినిమాల్లోకి హీరోయిన్ లా ఉంది' అని అనుకుంటారని మీరు చెబుతున్నారు. బాపు గారు లెజండరీ డైరెక్టర్, ఆయనతో పోలికను నేను తీసుకోలేను" అన్నారు. 

ఇక నా సినిమాల్లో ఏ హీరోయిన్ ను కూడా నేను ప్రత్యేక శ్రద్ధ పెట్టి అందంగా చూపించినదేం లేదు. నిజంగానే వాళ్లు అందగత్తెలు .. కెమెరా మెన్స్ తమదైన స్టైల్లో వాళ్లని చూపించారంతే. కృష్ణవంశీ వరుస సిక్సులు కొట్టారని మీరు అంటున్నారు. అలాంటిదేమి లేదు. నేను సిక్సులు మాత్రమే కాదు .. డకౌట్స్ కూడా చూశాను" అంటూ చెప్పుకొచ్చారు.

Go Back to Shorts
Krishnavamsi
Special
Tollywood

More Telugu News