గీతూ వెళుతుంటే అందరికంటే ముందుగా నేనే ఏడ్చాను: బాలాదిత్య
- 'గీతూ ఎందుకు వెళ్లిపోయిందనేది తనకు అర్థం కాలేదన్న బాలాదిత్య
- నా ఎలిమినేషన్ జరుగుతుందని నేను ఊహించలేదని వివరణ
- నేను బయట ఎలా ఉంటానో హౌస్ లోను అలాగే ఉన్నానని వెల్లడి
- నా ఆట తీరు పట్ల నేను సంతృప్తికరంగానే ఉన్నానన్న బాలాదిత్య
''బిగ్ బాస్ హౌస్ కి వెళ్లడం వలన నా గురించి పదిమందికీ తెలుస్తుంది .. కొత్తగా ఏవో అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో నేను వెళ్లలేదు. నేనేంటో నిరూపించుకోవడం కోసం వెళ్లాను. బిగ్ బాస్ హౌస్ లో ఆ స్థాయి ఎమోషన్స్ ఉంటాయా అనుకుంటారు .. నిజంగానే ఉంటాయి. అందువల్లనే గీతూ వెళుతుంటే అందరికంటే ముందుగా నేనే ఏడ్చాను. గీతూకి బిగ్ బాస్ అంటే ఎంతో ఇష్టం. తాను ఎలిమినేట్ అయినప్పుడు తను అందుకే అంతగా బాధపడింది" అనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
''గీతూ మంచి గేమర్ ఆమె ఎందుకు ఎలిమినేట్ అయిందనేది నాకు అర్థం కాలేదు. అలాగే సూర్య ఎందుకు ఎలిమినేట్ అయ్యాడనేది కూడా నాకు తెలియలేదు. అలాగే నేను ఎందుకు బయటికి వచ్చాననేది కూడా నాకు అర్థం కాలేదు. గీతూ .. నేను ఎలిమినేట్ కావడానికి శ్రీహాన్ కారణమని అనుకుంటున్నారుగానీ, అందులో నిజం ఉండే అవకాశం లేదు. ఏదేమైనా 10 వారాల పాటు బిగ్ బాస్ లో ఉన్నాను .. మంచి పేరుతోనే బయటికి వచ్చాను. అందుకు సంతృప్తికరంగా ఉంది. బిగ్ బాస్ నాకు ఎంతో నేర్పించింది" అంటూ చెప్పుకొచ్చాడు.