కాంతార ఓటీటీ విడుదల ఖరారు.. ఎక్కడ చూడొచ్చంటే..!
- చిన్న చిత్రంగా వచ్చి భారీ విజయం సొంతం చేసుకున్న కన్నడ సినిమా
- తెలుగు, తమిళ, హిందీలోనూ విశేష స్పందన
- ఈ నెల 24 నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్
థియేటర్లలో ఇంకా సందడి చేస్తూనే ఉన్న ‘కాంతార’ ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ కాబోతోందని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ హక్కులు దక్కించుకుంది. వాస్తవానికి ఈ నెల 4వ తేదీనే ఓటీటీలో విడుదల చేయాలని భావించారు. కానీ, థియేటర్లలో విశేష స్పందన రావడంతో ఓటీటీ స్ట్రీమ్ ను వాయిదా వేశారు. ఎట్టకేలకు వచ్చే వారం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ చేయాలని నిర్ణయించారు.