బంగాళాఖాతంలో అల్పపీడనాల జోరు... తాజాగా మరొకటి!
- ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
- ఈ నెల 19 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం
- అనంతరం దక్షిణ కోస్తాంధ్ర దిశగా పయనం
- ఈ నెల 21న పలు చోట్ల భారీ వర్షాలు
ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఈ నెల 19 నాటికి వాయుగుండంగా బలపడి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమవుతుందని ఐఎండీ వివరించింది. ఆపై రాగల మూడ్రోజుల్లో ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర దిశగా ప్రయాణిస్తుందని పేర్కొంది.
దీని ప్రభావంతో ఈ నెల 21న ఏపీ దక్షిణ కోస్తాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. గంటకు 55 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుందని తెలిపింది.