Tirumala: తిరుమలలో భక్తులను అక్రమంగా పంపుతున్న కానిస్టేబుల్ అరెస్ట్

Constable who is sending devotees in to Tirumala temple by taking money is arrested
షార్ట్స్‌లో చూడండి
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలోకి భక్తులను అక్రమంగా పంపుతున్న కానిస్టేబుల్ ను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. క్యూలైన్ లోకి భక్తులను అక్రమంగా పంపుతున్న ఈ భాగోతం గత కొంత కాలంగా జరుగుతోంది. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న ఈయన కొంత మందితో కలిసి ఈ దందాను ప్రారంభించాడు. 

భక్తుల నుంచి నగదు తీసుకుని టికెట్లు లేకుండానే క్యూ లైన్లలోకి పంపుతున్నాడు. ఈ విషయాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. భక్తుల నుంచి నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Go Back to Shorts
Tirumala
Constable
Bribe

More Telugu News