బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ అనంతబాబు... విచారణ వచ్చే నెల 12కు వాయిదా

supreme court adjourns mlc anantha babu bail petition
  • డ్రైవర్ హత్య కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ అనంతబాబు
  • బెయిల్ పిటిషన్లను కొట్టేసిన రాజమహేంద్రవరం కోర్టు, ఏపీ హైకోర్టు
  • అనంతబాబు బెయిల్ పిటిషన్ పై వచ్చే నెల 12న సుప్రీంకోర్టులో తదుపరి విచారణ
  • తమ వాదనలూ పరిగణనలోకి తీసుకోవాలన్న సుబ్రహ్మణ్యం తండ్రి 
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టయిన వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ కోసం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ సోమవారం విచారణకు రాగా... అనంతబాబు బెయిల్ పిటిషన్ పై కౌంటర్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం, సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈ పిటిషన్ పై తదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 12కు వాయిదా వేసింది. అనంతబాబుకు బెయిల్ ను రాజమహేంద్రవరం కోర్టుతో పాటు ఏపీ హైకోర్టు ఇదివరకే తిరస్కరించిన నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అనంతబాబు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. అనంతబాబు బెయిల్ పిటిషన్ పై విచారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే అదే సమయంలో ఈ పిటిషన్ విచారణలో భాగంగా తమ వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ డ్రైవర్ సుబ్రహ్మణ్యం తండ్రి కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు... రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది.
Go Back to Shorts
Andhra Pradesh
YSRCP
MLC Anantha Babu
Supreme Court
AP High Court
Bail Petition

More Telugu News