దేశంలో మొదలైన పెళ్లిళ్ల సీజన్.. లక్షల కోట్ల వ్యాపారం!
- ఈ నెల 4 నుంచి వచ్చే నెల 14 వరకు 32 లక్షల వివాహాలు
- మొత్తంగా రూ. 3.75 లక్షల కోట్ల వ్యాపారం
- ఒక్క ఢిల్లీలోనే 3.5 లక్షల వివాహాలు జరుగుతాయన్న సీఏఐటీ
దేశవ్యాప్తంగా 35 నగరాల్లోని 4,302 మంది వ్యాపారులు, సర్వీస్ ప్రొవైడర్ల నుంచి ఈ వివరాలను సేకరించింది. ఈ సీజన్‌లో ఒక్క ఢిల్లీలోనే 3.5 లక్షల వివాహాలు జరగనున్నట్టు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. ఈ వివాహాల ద్వారా రూ. 75 వేల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.
ఇక గతేడాది ఇదే సీజన్‌లో దేశంలో 25 లక్షల వివాహాలు జరిగాయని, వాటి ద్వారా రూ. 3 లక్షల కోట్ల మేర వ్యాపారం జరిగిందని వివరించారు. ఈ సీజన్‌లో మార్కెట్‌లో మొత్తంగా 3.75 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగే అవకాశం ఉందన్నారు. ఈ సీజన్ ముగిశాక, జనవరి 14 నుంచి జులై వరకు మళ్లీ పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుందని ఖండేల్వాల్ పేర్కొన్నారు.