బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తల్లి జీనత్ కు తీవ్ర గుండెపోటు... ఆసుపత్రికి తరలింపు

Aamir Khan mother suffers heart attack
  • ఇటీవల జీనత్ హుస్సేన్ కు తీవ్ర గుండెపోటు
  • బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించిన ఆమిర్ ఖాన్
  • కోలుకుంటున్న జీనత్
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తల్లి జీనత్ హుస్సేన్ తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. ముంబయిలోని పంచగని నివాసంలో ఆమిర్ ఖాన్ కుటుంబం దీపావళి వేడుకల్లో ఉండగా, గుండెపోటుతో జీనత్ కుప్పకూలిపోయినట్టు తెలుస్తోంది. వెంటనే స్పందించిన ఆమిర్ ఖాన్ ఆమెను ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని జాతీయ మీడియా పేర్కొంది. 

తల్లి గుండెపోటుకు గురైనప్పటి నుంచి ఆమిర్ ఖాన్ ఆసుపత్రిలోనే ఉన్నాడని వెల్లడించింది. కాగా, తల్లి ఆరోగ్య పరిస్థితిపై ఆమిర్ ఖాన్ నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రకటన రాలేదు.
Go Back to Shorts
Aamir Khan
Zeenat Hussain
Heart Attack
Mumbai
Bollywood

More Telugu News