Babu Mohan: 'అమ్మోరు' సినిమాను సౌందర్య చేయడానికి కారణం నేనే: బాబూ మోహన్

Babu Mohan Interview
షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరపై సందడి చేసిన హాస్యనటులలో బాబూ మోహన్ ఒకరు. వెయ్యికి పైగా సినిమాలు చేసిన ఆయన, కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, గతంలోని కొన్ని ఆసక్తికరమైన సంఘటనలను గురించి ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ .. "బ్రహ్మానందం తరువాత మూడేళ్లకి నేను ఇండస్ట్రీకి వచ్చాను. బ్రహ్మానందం గారు .. కోటగారితో కలిసి నటిస్తూ టాప్ కి వెళ్లిపోయాను. మా మధ్యలో ఈర్ష్యా ద్వేషాలు ఉండేవి కాదు" అన్నారు.

"సౌందర్య ఫస్టు సినిమా 'మనవరాలి పెళ్లి'. అయితే ఆ సినిమాకంటే ముందుగానే 'అమ్మోరు' సినిమా విడుదలైంది. సౌందర్యకి 'అమ్మోరు'లో ఛాన్స్ రావడానికి కారకుడిని నేనే. ఆ సినిమాలో హీరోయిన్ గా కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని శ్యామ్ ప్రసాద్ రెడ్డిగారు వాళ్లు వెదుకుతున్నారు.  'మనవరాలి పెళ్లి' షూటింగులో నటిస్తున్న నేను, సౌందర్య ఫొటోలు తీసుకుని వెళ్లి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఇచ్చాను. ఆ మరుసటి రోజునే శ్యామ్ ప్రసాద్ రెడ్డిగారు వాళ్లు వచ్చి ఆమెను సెలెక్ట్ చేశారు.

'అమ్మోరు' సినిమా సౌందర్యకి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా ఏ రేంజ్ లో ఆడిందో నేను చెప్పవలసిన పని లేదు. ఆ తరువాత వచ్చిన 'రాజేంద్రుడు గజేంద్రుడు' కూడా హిట్ అయింది. మూడో సినిమాగా వచ్చిన 'మాయలోడు' తరువాత ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ సినిమాలో 'చినుకు చినుకు అందెలతో' పాటకిగాను ఆమె నాతో కలిసి డాన్స్ చేయడం విశేషం" అంటూ చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Babu Mohan
Soundarya
Tollywood

More Telugu News