మద్యం షాపుల మూసివేత.. సీఎం విజయ్ నిర్ణయంపై కమల్ హాసన్ ప్రశంసలు

  • తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే విజయ్ సంచలన నిర్ణయం
  • విద్యాసంస్థలు, ఆలయాల సమీపంలో 717 మద్యం దుకాణాల మూసివేత
  • సీఎం విజయ్ నిర్ణయాన్ని స్వాగతించిన ప్రముఖ నటుడు కమల్ హాసన్
  • ఇది శుభారంభం మాత్రమేనని.. పూర్తి నియంత్రణ అవసరమని కమల్ సూచన
తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయ్ సంచలన నిర్ణయంతో తన పాలనను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు, దేవాలయాలు, బస్టాండ్ల సమీపంలో ఉన్న 717 మద్యం దుకాణాలను తక్షణమే మూసివేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల నుంచి చాలాకాలంగా వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

సీఎం విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ విజయ్‌కు అభినందనలు తెలిపారు. తమిళ కుటుంబాల ఆకాంక్షలను గౌరవిస్తూ, పదవి చేపట్టిన వెంటనే సీఎం విజయ్ తీసుకున్న ఈ చర్య ప్రశంసనీయమని కమల్ పేర్కొన్నారు.

మద్యం విక్రయించడం ప్రభుత్వ ప్రధాన విధి కాకూడదని, దాని ప్రవాహాన్ని నియంత్రించడంపైనే దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ప్రస్తుతం 717 దుకాణాలను మూసివేయడం ఒక మంచి ప్రారంభమని, భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింత పెంచి, పూర్తి నియంత్రణ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని కమల్ హాసన్ ఆకాంక్షించారు. ఈ నిర్ణయంతో విజయ్ తన పాలనపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని రాజకీయ వర్గాలు అభిప్రాయ ప‌డుతున్నాయి.
Go Back to Shorts

More Telugu News