విజయ్ దేవరకొండతో కలిసి యాక్ట్ చేయాలనుంది: శివ కార్తికేయన్
- ఈ నెల 21న 'ప్రిన్స్' విడుదల
- ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న టీమ్
- అనుదీప్ మార్క్ కామెడీ ఉంటుందన్న హీరో
- విజయ్ దేవరకొండ జర్నీ తనకి స్ఫూర్తి అంటూ వ్యాఖ్య
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటులో శివకార్తికేయన్ మాట్లాడుతూ .. "ఈ ఫంక్షన్ కి విజయ్ దేవరకొండ రావడం ఆనందంగా ఉంది. ఆయన చేసిన 'గీత గోవిందం' సినిమాను నేను చాలాసార్లు చూశాను. నా జర్నీ ట్రైన్ జర్నీలా కొనసాగుతూ వచ్చింది. పికప్ అందుకునేలోగా స్టేషన్ వచ్చినట్టు. కానీ విజయ్ దేవరకొండ జర్నీ అలా కాదు, ఆయన ఒక్కసారిగా రాకెట్ లా దూసుకుపోయాడు. ఆయన జర్నీ నాకు స్ఫూర్తి. అలాంటి ఆయనతో కలిసి త్వరలో ఒక సినిమా చేయాలనుంది" అని అన్నాడు.
హరీశ్ శంకర్ గారి 'గబ్బర్ సింగ్' సినిమాను నేను ఇప్పటికీ మరిచిపోలేదు. ఆయనతోను కలిసి పనిచేయాలనుంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, అనుదీప్ మార్క్ కామెడీని చూస్తూ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా కోసం మరియా చాలా కష్టపడింది. ఈ నెల 21వ తేదీన అందరూ థియేటర్స్ కి వెళ్లి ఈ సినిమాను చూడండి .. మీకు తప్పకుండా నచ్చుతుంది. 'వరుణ్ డాక్టర్' .. 'డాన్' సినిమాల మాదిరిగానే, ఈ సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను" అంటూ శివకార్తికేయన్ చెప్పుకొచ్చాడు.