విశాఖ వైసీపీ రాజకీయ యాత్ర తుస్సుమంది.. ఆ ఉక్రోషంతోనే జనసేన నేతల అరెస్టులు: లోకేశ్
- జనసేన నేతలు, కార్యకర్తల అరెస్టులు దుర్మార్గమన్న లోకేశ్
- అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్
- పవన్ బస చేసిన హోటల్ గదులను తనిఖీ చేయడాన్ని ఖండించిన టీడీపీ నేత
కాగా, విశాఖ విమానాశ్రయంలో వైసీపీ మంత్రులు, నాయకులపై రాళ్ల దాడికి సంబంధించిన కేసులో గత అర్ధ రాత్రి పోలీసులు జనసేన నాయకులు కోన తాతారావు, పీతల మూర్తియాదవ్, విశ్వక్‌సేన్, సుందరపు విజయ్ కుమార్, పంచకర్ల సందీప్, శివప్రసాద్‌రెడ్డి, పీవీఎస్ఎన్ రాజు, శ్రీనివాస్ పట్నాయక్, కీర్తీస్, యశస్విని, గేదెల చైతన్య, పట్టిమ రాజులను అరెస్ట్ చేశారు. విశాఖ విమానాశ్రయం వద్ద సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని అరెస్ట్ చేశారు.