Munugode: డ‌ప్పు కొట్టి ద‌రువేసిన ఎమ్మెల్యే సీత‌క్క‌... వీడియో ఇదిగో

congress mla seethakka plays dappu and dances
షార్ట్స్‌లో చూడండి
మునుగోడు ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయా పార్టీల నేత‌లు ఉత్సాహంగా సాగుతున్నారు. త‌మ త‌మ పార్టీల‌కే ఓటేయాలంటూ ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు త‌మ‌దైన శైలి వినూత్న చ‌ర్య‌లతో ఆక‌ట్టుకునే య‌త్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి పాల్వాయి స్ర‌వంతి త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న ములుగు ఎమ్మెల్యే సీత‌క్క డ‌ప్పు క‌ళాకారుల‌తో క‌లిసి డ‌ప్పు కొట్టి మ‌రీ ద‌రువేశారు.

మునుగోడులోని నాంప‌ల్లి మండ‌లంలో శ‌నివారం సీత‌క్క‌ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా డ‌ప్పు క‌ళాకారుల విజ్ఞ‌ప్తి మేర‌కు భుజానికి డ‌ప్పు త‌గిలించుకుని మ‌రీ...డ‌ప్పు క‌ళాకారుల‌తో డ‌ప్పు వాయిస్తూ... డ‌ప్పు చ‌ప్పుళ్ల‌కు ద‌రువు వేశారు. అనంత‌రం మండ‌ల పరిధిలోని గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లిన సీత‌క్క‌... ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గుర్తుకు ఓటేసి స్ర‌వంతిని గెలిపించాల‌ని ఓట‌ర్లను అభ్య‌ర్థించారు.
Go Back to Shorts
Munugode
Congress
Seethakka
Telangana

More Telugu News