విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కల్యాణ్... ఘనస్వాగతం పలికిన జనసైనికులు

Pawan Kalyan arrives Vizag airport
  • విశాఖ పర్యటనకు వచ్చిన పవన్ కల్యాణ్
  • ఎయిర్ పోర్టు వద్దకు పోటెత్తిన అభిమానులు
  • ఉత్సాహంగా అభివాదం చేసిన పవన్ కల్యాణ్
  • కాసేపట్లో ర్యాలీ
ఉమ్మడి విశాఖ జిల్లాలో మూడ్రోజుల పర్యటన నిమిత్తం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ సాయంత్రం వైజాగ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ మధ్యాహ్నం నుంచే ఎయిర్ పోర్టు వద్దకు భారీగా తరలివచ్చిన జనసైనికులు తమ అధినేత రాకతో నినాదాలతో హోరెత్తించారు. పవన్ కల్యాణ్ కు ఘనస్వాగతం పలికారు. 

అభిమానుల సంతోషాన్ని చూసి పవన్ కల్యాణ్ కూడా ఉత్సాహంతో వారికి అభివాదం చేశారు. విశాఖ ఎయిర్ పోర్టు వెలుపల జనసేన కళాకారులు వివిధ కళారూపాలు ప్రదర్శిస్తూ పండుగ వాతావరణాన్ని సృష్టించారు. కాగా, మరికాసేపట్లో జనసేన ర్యాలీ ప్రారంభం కానుంది.
Go Back to Shorts
Pawan Kalyan
Visakhapatnam
Airport
Janasena

More Telugu News