మామూలు డాగ్‌ కాదు.. హాలోవీన్‌ కు రెడీ అయిన బ్యాట్‌ డాగ్‌.. వైరల్​ వీడియో ఇదిగో

Dog dressed up for halloween as bat dog
  • ‘అగుయండా గోల్డెన్’ పేరిట ఉన్న ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ అయిన వీడియో
  • కోటీ 8 లక్షలకుపైగా వ్యూస్.. లక్షల కొద్దీ లైకులతో వైరల్
  • ‘బ్యాట్ మ్యాన్ కంటే బ్యాట్ డాగ్ బాగుంది’ అంటూ నెటిజన్ల సరదా కామెంట్లు
మన దగ్గర పెద్దగా తెలియదుగానీ.. పాశ్చాత్య దేశాల్లో హాలోవీన్ ఫెస్టివల్ అంటే తెగ క్రేజ్ ఉంటుంది. జనం దెయ్యాల్లా, జంతువుల్లా, ఇతర చిత్ర విచిత్రమైన ఆకారాల్లో వేషం వేసుకుని వీధుల్లో తిరుగుతారు. అలాగే పార్టీలు కూడా చేసుకుంటుంటారు. ఇది వాళ్లకు మామూలే. కానీ ఓ వ్యక్తి మాత్రం తన శునకాన్ని హాలోవీన్ కోసం సిద్ధం చేసిన వీడియో మాత్రం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఎందుకంటే అతను ‘బ్యాట్ మ్యాన్’ స్టయిల్ లో తన  శునకాన్ని ‘బ్యాట్ డాగ్’గా మార్చేశాడు మరి.

బ్యాట్ మ్యాన్ లా మాస్క్, బూట్లతో..
అచ్చం బ్యాట్ మ్యాన్ క్యారెక్టర్ పెట్టుకునే మాస్క్ శునకానికి పెట్టి.. బ్యాట్ మ్యాన్ వెనుకాల వేలాడదీసుకునే వస్త్రంలా ఓ నల్లని వస్త్రాన్ని మెడకు కట్టారు. ఆ వేషధారణను శునకం కూడా బాగానే ఇష్టపడినట్టు ఉంది. వీడియో తీస్తుంటే.. బాగా నిలబడి ఫోజిచ్చింది. అక్కడే ఓ ఫ్యాన్ ఉండటంతో.. ఆ గాలికి ‘బ్యాట్ డాగ్’కు కట్టిన వస్త్రం కదులుతూ ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
  • ‘అగుయండా గోల్డెన్’ అనే ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన ఈ వీడియోకు ఏకంగా కోటీ 8 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. లక్షల కొద్దీ లైకులు, వేల కొద్దీ రీట్వీట్లు నమోదవడం గమనార్హం.
  • ‘బ్యాట్ డాగ్ బాగుంది. మాకు బాగా నచ్చింది’ అని కొందరు కామెంట్ చేస్తే.. ‘బ్యాట్ మ్యాన్ కంటే బ్యాట్ డాగ్ బెటర్ గా కనిపిస్తోంది’ అని మరికొందరు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
  • ఇంకొందరేమో ‘పాపం కుక్క మీద ఇలాంటి ప్రయోగాలేంటి? దాన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు?’ అని మండిపడుతున్నారు.
  • ‘బ్యాట్ డాగ్ మా ఇంటికి వచ్చెయ్.. మేం పిల్లులతో పడుతున్న బాధను తీర్చేయ్’ అంటూ కొందరు సరదా కామెంట్లు పెడుతున్నారు కూడా. ‘హాలోవీన్ రోజున బెస్ట్ కాస్ట్యూమ్స్ అవార్డు నీకే..’ అంటూ మరికొందరు నెటిజజన్లు అంటున్నారు.
Go Back to Shorts
Dog
Dressed up like Batman
Batman
Offbeat
Viral Videos
Twitter

More Telugu News