రాజ‌స్థాన్‌లో రోడ్డు ప్ర‌మాదం... తెలంగాణ సీఐడీ డీజీ గోవింద్ సింగ్ స‌తీమ‌ణి దుర్మ‌ర‌ణం

ts cid dg goving singh wife died at accident in rajasthan
  • మాతేశ్వ‌రి త‌నోత‌రాయ్ మాత ఆల‌య సంద‌ర్శ‌న‌కు వెళ్లిన గోవింద్ సింగ్ దంప‌తులు
  • తిరుగు ప్ర‌యాణంలో రామ్ గ‌ఢ్ వ‌ద్ద బోల్తా ప‌డ్డ కారు
  • ఘట‌నా స్థ‌లిలోనే ప్రాణాలు కోల్పోయిన షీలా సింగ్‌
  • గాయాలతో బ‌య‌ట‌ప‌డ్డ గోవింద్ సింగ్‌, కారు డ్రైవ‌ర్‌
రాజ‌స్థాన్‌లో జ‌రిగిన ఓ రోడ్డు ప్ర‌మాదంలో తెలంగాణ సీఐడీ డీజీ గోవింద్ సింగ్ స‌తీమ‌ణి షీలా సింగ్ మృతి చెందారు. ఈ ప్ర‌మాదంలో గోవింద్ సింగ్ స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. గోవింద్ సింగ్‌తో పాటు ఆయ‌న కారు డ్రైవ‌ర్ కూడా గాయాల‌పాల‌య్యారు. రాజ‌స్థాన్‌లోని మాతేశ్వ‌రి త‌నోత‌రాయ్ మాత ఆల‌యాన్ని సంద‌ర్శించుకునే నిమిత్తం భార్య షీలా సింగ్‌తో క‌లిసి గోవింద్ సింగ్ వెళ్లారు.

మాతేశ్వ‌రిని ద‌ర్శించుకున్న అనంత‌రం గోవింద్ సింగ్ స‌తీస‌మేతంగా తెలంగాణ‌కు తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో రామ్ గ‌ఢ్ స‌మీపంలో ఘంటియాలి మాత ఆల‌యం స‌మీపంలోకి రాగానే గోవింద్ సింగ్ కారు బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో షీలా సింగ్ అక్క‌డిక్క‌డే మృతి చెందారు. ప్ర‌మాదంపై స‌మాచారం అందుకున్న బీఎస్ఎఫ్ జ‌వాన్లు అక్క‌డికి చేరుకుని గాయ‌ప‌డ్డ గోవింద్ సింగ్‌, ఆయ‌న కారు డ్రైవ‌ర్‌ను స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. గోవింద్ సింగ్ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు.
Go Back to Shorts
Telangana
CID DG
Govind Singh
Rajasthan
Road Accident

More Telugu News