Team India: నేడు చివరి టీ20... దక్షిణాఫ్రికాపై టాస్ గెలిచిన టీమిండియా

Team India won the toss in the third T20
షార్ట్స్‌లో చూడండి
టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య నేడు చివరిదైన మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఇండోర్ లోని హోల్కర్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. టీమిండియా ఇప్పటికే 2-0తో సిరీస్ గెలిచినందున, ఈ మ్యాచ్ కు ప్రాధాన్యం లేకుండా పోయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. 

టీమిండియా తుది జట్టులో శ్రేయాస్ అయ్యర్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్ లకు స్థానం కల్పించారు. వీపునొప్పితో అర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. ఇక దక్షిణాఫ్రికా జట్టులో ఆన్రిచ్ నోర్జే స్థానంలో డ్వేన్ ప్రిటోరియస్ కు స్థానం కల్పించారు.
Go Back to Shorts
Team India
South Africa
3rd T20
Toss
Indore

More Telugu News