నితీశ్ కుమార్ బీజేపీకి నమ్మకద్రోహం చేశారు: అమిత్ షా
- ప్రధాని కావాలనే ఆశతో నమ్మకద్రోహం చేశారన్న అమిత్ షా
- బీహార్ లో బీజేపీ సాధించిన సీట్లలో నితీశ్ పార్టీ సగమే సాధించిందని వ్యాఖ్య
- అయినా నితీశ్ ను మోదీ సీఎం చేశారన్న కేంద్ర మంత్రి
అమిత్ షా ప్రస్తుతం రెండు రోజుల పర్యటనకు గాను బీహార్ లో ఉన్నారు. గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన సీట్లలో కేవలం సగం మాత్రమే నితీశ్ కుమార్ పార్టీ సాధించిందని ఆయన చెప్పారు. అయినప్పటికీ నితీశ్ కు సీఎం అయ్యే అవకాశాన్ని ప్రధాని మోదీ కల్పించారని అన్నారు. నితీశ్ కుమార్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మోదీ చెప్పారని... చెప్పిన విధంగానే తక్కువ సీట్లు వచ్చినా నితీశ్ ను సీఎం చేశారని అన్నారు. అయినప్పటికీ నితీశ్ కుమార్ నమ్మకద్రోహం చేసి, వెళ్లిపోయారని విమర్శించారు. ప్రధాని కావాలనే కోరికతో కాంగ్రెస్, లాలూ ప్రసాద్ తో చేతులు కలిపారని దుయ్యబట్టారు.