Mahesh Babu: తొలి షెడ్యూలును పూర్తి చేసుకున్న మహేశ్ బాబు కొత్త చిత్రం

Mahesh Babu new movie first schedule completed
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న కొత్త చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రముఖ స్టంట్ కొరియోగ్రఫీ ట్విన్స్ 'అన్బరివ్' (అన్బుమణి-అరివుమణి) ద్వయం పర్యవేక్షణలో కొన్ని హై ఓల్టేజ్ యాక్షన్ దృశ్యాలను చిత్రీకరించారు.

ఈ షెడ్యూల్ లో మహేశ్ బాబు కూడా పాల్గొన్నారు. కాగా, రెండో షెడ్యూల్ దసరా తర్వాత ప్రారంభం కానుంది. ఆ షెడ్యూల్ లో మహేశ్ బాబుతో పాటు హీరోయిన్ పూజా హెగ్డేపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ మేరకు నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశారు. త్వరలోనే మరిన్ని అప్ డేట్స్ వెల్లడిస్తానని తెలిపారు. 

అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్-త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పన్నెండేళ్ల తర్వాత ఈ కాంబోలో ఓ చిత్రం సెట్స్ మీదకు వచ్చింది. ఈ చిత్రంలో మహేశ్ బాబు లుక్ కొత్తగా ఉండడం అభిమానుల్లో మరింత ఆసక్తి కలిగిస్తోంది.
Go Back to Shorts
Mahesh Babu
Trivikram Srinivas
First Schedule
SSMB28
Tollywood

More Telugu News