హడావిడి పడిపోతున్న విజయ్ దేవరకొండ .. కూల్ గా ఉన్న సమంత!
- 'లైగర్'తో దెబ్బతిన్న విజయ్ దేవరకొండ
- షూటింగు దశలో ఉన్న 'ఖుషి'
- డిసెంబర్ 23వ తేదీన విడుదల
- సమంత బిజీ వలన వాయిదా పడొచ్చంటూ టాక్
శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నాయికగా సమంత అలరించనుంది. ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. డిసెంబర్ 23వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఆ డేట్ మారకూడదనేది విజయ్ దేవరకొండ ఆలోచన.
అందువల్లనే షెడ్యూల్స్ మధ్య గ్యాప్ ఎక్కువగా లేకుండా చూడమని డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ చెప్పాడట. అక్టోబర్ ఫస్టు వీక్ లో ఒక షెడ్యూల్ ను ప్లాన్ చేశారని తెలుస్తోంది. అయితే సమంత ఇటు తెలుగులోను.. అటు హిందీలోనూ వరుస ప్రాజెక్టులతో కూల్ గానే దూసుకుపోతోంది. ఇకపై టాలీవుడ్ డైరెక్టర్లకి ఆమె అందుబాటులో ఉండటం కూడా కష్టమేనని అంటున్నారు. ఈ కారణంగానే 'ఖుషి' వాయిదాపడే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తుండటం కొసమెరుపు.