తెలుగు సినిమా 'తగ్గేదే లే' అని నిరూపించారు: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
- సైమా అవార్డుల్లో 6 అవార్డులను గెలుచుకున్న పుష్ప
- పుష్ప అవార్డులపై సోషల్ మీడియాలో సాయిరెడ్డి పోస్టులు
- అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వం అద్భుతమని ప్రశంస
ఆదివారం జరిగిన సైమా అవార్డుల ప్రదానోత్సవంలో పుష్ప చిత్రం ఏకంగా 6 అవార్డులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావించిన సాయిరెడ్డి.. పాన్ ఇండియా మూవీగా రికార్డ్స్ బ్రేక్ చేసి సైమా అవార్డుల్లో సత్తాచాటి ఏకంగా 6 అవార్డులు గెలుచుకున్న 'పుష్ప' చిత్రం యూనిట్ కు అభినందనలు అంటూ పేర్కొన్నారు. సినిమాలో అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వం అద్భుతమని ఆయన ప్రశంసించారు.