మహారాణి అస్తమయం నేపథ్యంలో... ఇక బ్రిటన్ రాజుగా చార్లెస్!
- బ్రిటన్ రాజుగా ఎలిజబెత్2 పెద్ద కుమారుడు చార్లెస్
- రాజకుటుంబ నిబంధనల ప్రకారం అధినేత మరణిస్తే
వారి మొదటి వారసులకే పగ్గాలు - వేల్స్ కు యువరాజుగా వ్యవహరించిన 73 ఏళ్ల చార్లెస్
వేల్స్ కు గతంలో యువరాజుగా వ్యవహరించిన చార్లెస్ ఇప్పుడు బ్రిటన్ కు అధినేతగా వ్యవహరిస్తారు. ఇకపై 14 కామన్వెల్త్ దేశాలకు రాజుగా కూడా ఉంటారు. చార్లెస్ 1948 నవంబరు 14న బకింగ్‌హామ్ ప్యాలెస్ లో జన్మించారు. ఎలిజబెత్-2 నలుగురు పిల్లల్లో ఆయనే పెద్దవారు. చార్లెస్ 1981లో డయానాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు విలియమ్, హ్యారీ ఉన్నారు. అయితే, 1992లో చార్లెస్ -డయానా దంపతులు విడిపోయారు. 1997లో జరిగిన రోడ్డు ప్రమాదంలో డయానా మృతి చెందారు. ఈ విషయంలో చార్లెస్ విమర్శలను ఎదుర్కొన్నారు. 2005లో 56 ఏళ్ల వయసులో చార్లెస్.. కెమెల్లా పార్కర్‌ను రెండో వివాహం చేసుకున్నారు.