పవన్ కల్యాణ్ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే రోశయ్య
Add ap7am to your home Screen

పవన్ కల్యాణ్ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే రోశయ్య

YCP MLA Venkatroshaiah Kilari is in Pawan Kalyans Birth Day celebrations
  • ఈ నెల 2న పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు
  • ఉప్పలపాడులో జరిగిన వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే
  • జనసేన నాయకులతో కలిసి అన్నం వడ్డించిన వైనం
జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా జరిగిన అన్నదాన కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే పాల్గొనడం చర్చనీయాంశమైంది. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని పెదకాకాని మండలం ఉప్పలపాడులో ఈ నెల 2న అభిమానులు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య పాల్గొని జనసేన నాయకులతో కలిసి అన్నం వడ్డించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా వెలుగులోకి వచ్చి చర్చనీయాంశమయ్యాయి.
Venkatroshaiah Kilari
YSRCP
Guntur District
Pawan Kalyan

More Telugu News