భక్తులకు నేటి నుంచే ఖైరతాబాద్ పంచముఖి లక్ష్మీగణపతి దర్శనం
- మరికాసేపట్లో స్వామివారిని దర్శించి పూజలు చేయనున్న గవర్నర్ తమిళిసై
- 50 అడుగుల జంధ్యం, కండువా, పట్టువస్త్రాలను సమర్పించిన పద్మశాలి సంఘం
- భక్తుల కోసం ప్రత్యేకంగా విగ్రహ సమీపంలో పాదాల ఏర్పాటు
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరికాసేపట్లో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అంతకుముందు ఈ ఉదయం పద్మశాలి సంఘం తరపున 50 అడుగుల జంధ్యం, కండువా, గరికమాల, పట్టువస్త్రాలను స్వామి వారికి సమర్పించారు. కాగా, భక్తుల సౌకర్యార్థం ఈసారి స్వామివారి ప్రత్యేక పాదాలను ప్రధాన విగ్రహం సమీపంలో ఏర్పాటు చేశారు.