నాదెండ్ల మనోహర్ తో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు
- ఈ నెల 19న మనోహర్ సమక్షంలో హరి రాయల్ పై దాడి
- చొక్కా చింపి, చెప్పుతో కొట్టారంటూ బాధితుడి ఫిర్యాదు
- పవన్ కల్యాణ్ కౌలు రైతుభరోసా యాత్ర సందర్భంగా ఘటన
కేసు వివరాల్లోకి వెళ్తే... కడప జిల్లా సిద్ధవటంలో జనసేనాని పవన్ కల్యాణ్ కౌలు రైతుభరోసా యాత్ర సందర్భంగా జనసేన సీనియర్ నేత కోనేటి వెంకటరమణ అలియాస్ హరి రాయల్ ఏర్పాట్లను పరిశీలిస్తుండగా... నాదెండ్ల మనోహర్ సమక్షంలో ఆయనపై దాడి చేసి చొక్కా చింపి, చెప్పుతో కొట్టి అవమానపరిచారంటూ కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.