ప్రధాని మోదీతో భేటీ అయిన సీఎం జగన్
- పోలవరం ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చించిన జగన్
- మధ్యాహ్నం భారత రాష్ట్రపతిని కలవనున్న ముఖ్యమంత్రి
- అనంతరం పులువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం
మరోవైపు మధ్యాహ్నం 1.30 గంటలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. అనంతరం కేంద్ర విత్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తో జగన్ భేటీ కానున్నారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ ను కూడా కలవబోతున్నారు. ఢిల్లీ పర్యటనలో ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. మరోవైపు మోదీతో భేటీ సమయంలో జగన్ వెంట వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు.