ప్రధాని మోదీతో భేటీ అయిన సీఎం జగన్

Jagan meets PM Modi
ప్రధాని మోదీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. ఢిల్లీకి వెళ్లిన జగన్ ప్రధానిని కలిసి పలు విషయాలపై చర్చించారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు అంశాన్ని జగన్ ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. పోలవరం నిర్వాసితులకు పునరావాస కల్పన, పెండింగ్ బిల్లుల మంజూరు అంశాలపై సీఎం చర్చించారు. రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చాలని ప్రధాని కోరినట్టు సమాచారం. కాసేపటి క్రితం ప్రధానితో ఆయన సమావేశం ముగిసింది. 

మరోవైపు మధ్యాహ్నం 1.30 గంటలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. అనంతరం కేంద్ర విత్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తో జగన్ భేటీ కానున్నారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ ను కూడా కలవబోతున్నారు. ఢిల్లీ పర్యటనలో ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. మరోవైపు మోదీతో భేటీ సమయంలో జగన్ వెంట వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు.
Go Back to Shorts
Jagan
YSRCP
Narendra Modi
BJP
Droupadi Murmu
President Of India

More Telugu News