మహేశ్ తో త్రివిక్రమ్ చేసేది మాస్ యాక్షన్ మూవీనే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ తో త్రివిక్రమ్ చేసేది మాస్ యాక్షన్ మూవీనే!

Mahesh Babu in Trivikram Movie
  • త్రివిక్రమ్ తదుపరి సినిమాకి సన్నాహాలు 
  • రంగంలోకి దిగడానికి రెడీ అవుతున్న మహేశ్ బాబు 
  • కథానాయికగా అలరించనున్న పూజ హెగ్డే
  • మరో కథానాయికగా తెరపైకి ప్రియాంక అరుళ్ మోహన్  పేరు
త్రివిక్రమ్ ఇంతవరకూ చేస్తూ వచ్చిన సినిమాలలో సక్సెస్ రేటు ఎక్కువ. ఒక కథను అన్ని వైపుల నుంచి అల్లుకుని రావడం ఆయన ప్రత్యేకత. యూత్ .. మాస్ .. ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే అంశాలు అందులో ఉండేలా ఆయన చూసుకుంటాడు. ఇంతవరకూ ఆయన కథల్లో ఎక్కువగా లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ కనిపిస్తూ వచ్చాయి. 

త్రివిక్రమ్ సినిమాల్లో యాక్షన్ కూడా ఉంటుంది .. అయితే దాని పాళ్లు తక్కువ. ఇక త్రివిక్రమ్ ఇంతవరకూ మాస్ యాక్షన్ వైపు పెద్దగా వెళ్లింది లేదు. ఈ సారి మాత్రం మాస్ మసాలా మూవీ చేయనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. మహేశ్ తో ఆయన చేయనున్న సినిమా ఆ జోనర్ పరిధిలోనే తిరుగుతుందని అంటున్నారు.

మహేశ్ బాబు కూడా ఈ మధ్య కాలంలో మాస్ యాక్షన్ మూవీలు చేయలేదు. అందువలన ఈ జోనర్లో త్రివిక్రమ్ తో చేయడానికి ఆయన ఉత్సాహాన్ని చూపుతున్నాడని చెబుతున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే అలరించనుంది. మరో కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ పేరు వినిపిస్తోంది. వచ్చేనెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
Mahesh Babu
Pooja Hegde
Trivikram Movie

More Telugu News