వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ భేటీకి గోరంట్ల మాధ‌వ్ హాజ‌రైన ఫొటోను పోస్ట్ చేస్తూ మండిపడిన టీడీపీ

వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ భేటీకి గోరంట్ల మాధ‌వ్ హాజ‌రైన ఫొటోను పోస్ట్ చేస్తూ మండిపడిన టీడీపీ

hindupur mp gorantla madhav attend ysrcpp meeting
  • మ‌హిళ‌తో న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడినట్లుగా గోరంట్ల మాధ‌వ్‌ పై ఆరోపణలు
  • ప్రత్యేక కుర్చీ వేసి మరీ కూర్చోపెట్టారంటూ టీడీపీ విమర్శ 
  • సిగ్గు వాళ్ళకి లేదా ? మనకి లేదా ? అంటూ ప్రశ్న  
ఈ రోజు ఢిల్లీలో జ‌రిగిన వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ భేటీకి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌ హాజరవడంపై టీడీపీ మండిపడింది. 'దేశం సిగ్గు పడే పని చేసిన గోరంట్ల మాధవ్ ని సస్పెండ్ చేస్తున్నాం అని లీకులు ఇచ్చారు.. కట్ చేస్తే, ఈ రోజు ఢిల్లీలో పార్టీ సమావేశాలకు ప్రత్యేక కుర్చీ వేసి మరీ కూర్చోపెట్టారు. సిగ్గు వాళ్ళకి లేదా ? మనకి లేదా ?' అంటూ టీడీపీ ట్వీట్ చేసింది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి మాధవ్ హాజరైన ఫోటోను కూడా టీడీపీ పోస్ట్ చేసింది.

ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌ ఓ మ‌హిళ‌తో న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు రావడం, దానిని ఆయన మార్ఫింగ్ వీడియో అంటూ ఖండించడం విదితమే.  
YSRCP
YSRCPP
Gorantla Madhav

More Telugu News