ఆంధ్రా వర్సిటీ విద్యార్థిని ఛరిష్మా కృష్ణకు మిస్ సౌత్ ఇండియా కిరీటం

AU Student Charishma Krishna got Miss South India crown
  • మిస్ సౌత్ ఇండియా పోటీలు నిర్వహించిన పెగాసస్
  • ఫస్ట్, సెకండ్ రన్నరప్‌లుగా తమిళనాడు, కర్ణాటక భామలు
  • నృత్యకారిణిగా, నటిగా రాణిస్తున్న చరిష్మా కృష్ణ
విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థినికి ‘మిస్ సౌత్ ఇండియా’ కిరీటం దక్కింది. పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కేరళలోని కోచిలో నిర్వహించిన ఈ పోటీల్లో ఏయూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థిని ఛరిష్మా కృష్ణ విజేతగా నిలిచారు. 

ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి యువతులు హాజరయ్యారు. అందరినీ వెనక్కి నెట్టిన ఛరిష్మా విజేతగా నిలిచారు. ఓ వైపు చదువును కొనసాగిస్తూనే నృత్యకారిణిగా, నటిగా రాణిస్తున్నారు. కాగా, ఈ పోటీలో తమిళనాడుకు చెందిన దేబ్‌నితా కర్ ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా, కర్ణాటకకు చెందిన సమృద్ధి శెట్టి రెండో రన్నరప్‌గా నిలిచింది.
Go Back to Shorts
Charishma Krishna
Samruddhi Shetty
Debnita Kar
Andhra University
Miss South India

More Telugu News