ఢిల్లీలో చక్రం తిప్పడం కాదు.. ఉన్నది కూడా ఊడుతుంది.. సీఎం కేసీఆర్ పై ఈటల ఫైర్
- టీఆర్ఎస్ మంత్రుల్లో సగం మంది తెలంగాణ రాష్ట్రం వద్దన్నవాళ్లేనన్న ఈటల
- రాష్ట్రంలో టీఆర్ఎస్ రాజ్యాంగమే నడవాలన్నట్టు ఉందని విమర్శ
- సీఎం కేసీఆర్ కు ప్రజల సమస్యలు తెలుసుకునే సమయం లేదా? అని నిలదీత
దళితుల భూములు గుంజుకుంటున్నారు
గత ఎనిమిదేళ్లలో ప్రధాని మోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని.. అదే సమయంలో సీఎం కేసీఆర్ ఒక్కరోజు కూడా సచివాలయానికి వెళ్లలేదని ఈటల రాజేందర్ విమర్శించారు. కేసీఆర్ అయితే ప్రగతి భవన్ లో, లేకుంటే ఫామ్ హౌస్ లో ఉంటారని.. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు మాత్రం రావడం లేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు దళితుల అసైన్డ్ భూములను గుంజుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ కు బుద్ధి చెప్పే అవకాశం త్వరలోనే వస్తుందని, కేసీఆర్ పాలనను అంతం చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.