ఉమా మహేశ్వరి మరణంపై చంద్రబాబు భావోద్వేగ ట్వీట్
- ఆత్మహత్యకు పాల్పడ్డ ఉమా మహేశ్వరి
- వార్త విన్నంతనే కుటుంబంతో కలిసి ఉమా మహేశ్వరి ఇంటికెళ్లిన చంద్రబాబు
- ఆమె హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ట్వీట్
- ఎన్టీఆర్ క్రమశిక్షణను ఆమె పుణికిపుచ్చుకున్నారని నివాళి
ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సదరు ట్వీట్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మధ్యనే కుటుంబ సభ్యులందరం కలుసుకుని ఆనందంగా గడిపామని గుర్తు చేసుకున్న చంద్రబాబు... ఇంతలోనే ఇంతటి విషాద వార్త వినాల్సి రావడం దురదృష్టకరమని భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్టీఆర్ క్రమశిక్షణను పుణికిపుచ్చుకున్న ఉమామహేశ్వరి ఎంతో హుందాగా, శాంతంగా ఉండేవారని చంద్రబాబు తెలిపారు. ఉమా మహేశ్వరి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని ఆయన సంతాపం తెలిపారు.