మీరంతా కలిసి నాకే ఓ సెల్ఫీ ఇవ్వండి: చైతూ
- 'థ్యాంక్యూ' ప్రమోషన్స్ తో బిజీగా చైతూ
- స్టూడెంట్స్ తో కలిసి చేసిన సందడి
- సెల్ఫీల కోసం ఎగబడిన స్టూడెంట్స్
- రేపు విడుదలవుతున్న సినిమా
ఈ ఫంక్షన్ లో చైతూకి చాలామంది అమ్మాయిలు ఐ లవ్ యూ చెబుతూ హడావిడి చేశారు. రాశి ఖన్నా గురించి చెప్పమని పట్టుబట్టారు. ఆయనతో సెల్ఫీ తీసుకోవడానికి ఎగబడ్డారు. దాంతో తానే స్టేజ్ పై నుంచి వాళ్లందరితో సెల్ఫీ తీసుకుంటానని చైతూ అన్నాడు. అదే విధంగా వారితో ఒక సెల్ఫీ తీసుకున్నాడు.
రేపు ఈ సినిమా చూడటానికి తమ కాలేజ్ కి సెలవు ఇప్పించమని పట్టుబట్టారు. అది మాత్రం తన చేతుల్లో లేదని చైతూ తప్పించుకున్నాడు. అక్కడి స్టూడెంట్స్ ఆయనతో కలిసి డాన్స్ చేయాలని ముచ్చటపడ్డారు. దాంతో వాళ్లతో కలిసి చైతూ డాన్స్ చేశాడు. విడుదలకు ముందు చైతూ బాగానే సందడి చేశాడు. ఇక ఈ సినిమా థియేటర్స్ లో ఎలా సందడి చేస్తుందన్నది చూడాలి.