నీక్కూడా సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ లాయర్‌కు బెదిరింపులు
- సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తామంటూ ఇటీవల బెదిరింపులు
- హస్తిమల్‌ను లేఖ ద్వారా బెదిరించిన వైనం
- భద్రత కల్పించిన పోలీసులు
కోర్టులోని ఆయన చాంబర్ బయట ఈ లేఖ కనిపించింది. దీనిపై మూసేవాలా హత్యకేసు నిందితులైన లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ పేర్లలోని మొదటి అక్షరాలు ఉన్నాయి. బెదిరింపు లేఖ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ లాయర్‌కు భద్రత కల్పించినట్టు ఈస్ట్ జోధ్‌పూర్ అదనపు డిప్యూటీ కమిషనర్ నజీమ్ అలీ తెలిపారు. లేఖ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టు చెప్పారు.