కుమారుల మృతిని తలచుకుని అసెంబ్లీలోనే కన్నీరు పెట్టిన మహారాష్ట్ర సీఎం షిండే... వీడియో ఇదిగో
- బల పరీక్షలో నెగ్గిన ఏక్‌నాథ్ షిండే
- శివసేన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చానన్న సీఎం
- తన జీవితంలో విషాద ఘటనను గుర్తు చేసుకున్న షిండే
బల పరీక్షలో నెగ్గిన షిండే... తన రాజకీయ ప్రస్థానంపై అసెంబ్లీలో ఉద్వేగ ప్రసంగం చేశారు. తాను శివసేన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన తెలిపారు. ఒకేసారి తన ఇద్దరు కుమారులు మరణించారని... అదే తన జీవితంలో విషాద ఘటన అని ఆయన తెలిపారు. ఆ బాధ నుంచి తనను శివసేనకు చెందిన ఆనంద్ దిఘే బయటపడేశారని షిండే చెప్పారు. వెరసి తనకు రాజకీయాల్లోకి ప్రవేశం కల్పించడంతో పాటు బాధల్లో ఉన్న తనను ఆదుకున్నదీ శివసేనేనని ఆయన తెలిపారు.