జర్మనీ పర్యటన ముగించుకుని యూఏఈ పయనమైన ప్రధాని మోదీ
- రెండ్రోజుల పాటు జర్మనీలో పర్యటన
- మ్యూనిచ్ లో జీ7 దేశాల సదస్సుకు హాజరు
- పర్యటన సంతృప్తికరంగా సాగిందన్న మోదీ
- ప్రత్యేక విమానంలో యూఏఈ తరలి వెళ్లిన వైనం
కాగా, జర్మనీ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ యూఏఈ పర్యటనకు తరలి వెళ్లారు. ప్రత్యేక విమానంలో జర్మనీ నుంచి బయల్దేరిన మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకోనున్నారు. గత మే నెలలో 13వ తేదీన కన్నుమూసిన యూఏఈ మాజీ పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయేద్ అల్ నహ్యాన్ కు మోదీ నివాళులు అర్పించనున్నారు.