ఖైరతాబాద్‌లో ఈ సారి 50 అడుగుల మట్టి వినాయకుడు... నమూనా విడుదల
- ఖైరతాబాద్ గణేశ్ ప్రతిమ నమూనా విడుదల
- తొలిసారి పూర్తిగా మట్టితోనే రూపొందనున్న వినాయకుడు
- ఎడమ వైపు త్రిశక్తి మహా గాయత్రి, కుడి వైపు సుబ్రహ్మణ్యస్వామి రూపంతో నిమజ్జనానికి తరలనున్న వైనం
మట్టి గణపతుల వినియోగాన్ని ప్రోత్సహించాలన్న ప్రభుత్వ పిలుపుతోనే ఈ దఫా మట్టి వినాయకుడి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. పంచముఖ లక్ష్మీ గణపతి రూపంలో ఖైరతాబాద్ వినాయకుడు ఈ సారి దర్శనమివ్వనున్నాడు. ఎడమ వైపు త్రిశక్తి మహా గాయత్రి, కుడి వైపు సుబ్రహ్మణ్యస్వామి రూపంతో వినాయకుడు నిమజ్జనానికి తరలనున్నాడు.