గుజరాతీ చాక్లెట్ శాండ్ విచ్ చూసి సంభ్రమాశ్చర్యాలకు గురైన జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా
- గుజరాతీ వంటకాలంటే తనకు ఇష్టమన్న ఒమర్
- తాజాగా చాక్లెట్ శాండ్ విచ్ కు ఫిదా
- వీడియో పంచుకున్న కశ్మీరీ నేత
- ఇదేం కాంబినేషన్... అంటూ విస్మయం
"అసలు ఈ శాండ్ విచ్ తయారీకి ఉపయోగించిన పదార్థాల కాంబినేషన్ ను ఎవరు కనిపెట్టారో...? దీని అమ్మకాల సంగతేంటి?" అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను గుజరాతీ వంటకాలను విపరీతంగా ఇష్టపడతానని, కానీ ఈ చాక్లెట్ శాండ్ విచ్ కు అగ్రస్థానం ఇస్తానని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.
కాగా, ఈ వీడియోలో ఓ హృదయాకరంలో ఉన్న బ్రెడ్, బటర్, జామ్, డెయిరీ మిల్క్ చాక్లెట్ తురుము, చీజ్ తురుము, చాకోబార్ పై భాగంలో ఉండే చాక్లెట్ ను ఉపయోగించి శాండ్ విచ్ తయారు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.