16 ఏళ్లకే ముస్లిం యువతులు పెళ్లి చేసుకోవచ్చు... పంజాబ్, హర్యానా కోర్టు సంచలన తీర్పు
- 16 ఏళ్లకే పెళ్లి చేసుకున్న ముస్లిం యువతి
- రక్షణ కల్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన వైనం
- యువతి వివాహాన్ని గుర్తిస్తున్నట్లు ప్రకటించిన కోర్టు
- షరియా చట్టం ప్రకారం ముస్లిం యువతికి ఆ హక్కు ఉందంటూ వ్యాఖ్య
16 ఏళ్లు నిండిన ఓ యువతి తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుని తమకు రక్షణ కల్పించాలంటూ పంజాబ్, హర్యానా కోర్టును ఆశ్రయించింది. సదరు యువతి పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు షరియా చట్టాన్ని ఉటంకిస్తూ వారి వివాహాన్ని గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా షరియా చట్టం ప్రకారం 16 ఏళ్లు నిండిన ముస్లిం యువతికి తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది.