ఐపీఎల్ ముగింపు వేడుకకు ఏఆర్ రెహమాన్, రణవీర్ సింగ్
- అహ్మదాబాద్ స్టేడియంలో 29 రాత్రి 8 గంటల నుంచి ఫైనల్స్
- మ్యాచ్ ముగిసిన తర్వాత 45 నిమిషాల పాటు కార్యక్రమం
- మాజీ కెప్టెన్లు, పలువురు బాలీవుడ్ ప్రముఖులకు ఆహ్వానం
ఐపీఎల్ ఫైనల్స్ అనంతరం 45 నిమిషాల పాటు కార్యక్రమానికి బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇందులో పాల్గొననున్నారు. అలాగే, ఝార్ఖండ్ కు చెందిన ప్రముఖ ఛౌ డ్యాన్స్ కూడా ఉంటుందని సమాచారం. ఇందుకోసం బీసీసీఐ 10 మంది సభ్యుల ఝార్ఖండ్ ఛౌ డాన్స్ బృందాన్ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జైషా, టీమిండియా మాజీ కెప్టెన్లు ముగింపు వేడకకు హాజరుకానున్నారు. 2019 సీజన్ నుంచి ఐపీఎల్ ముగింపు వేడుక ఇప్పటి వరకు సాధ్యపడలేదు.