ఇరాన్‌పై కఠినంగా ట్రంప్.. భారీ సైనిక చర్యకు సంకేతాలు

Donald Trump signals massive military action against Iran
  • ఇరాన్‌పై భారీ సైనిక చర్యకు అవకాశం ఉందన్న ట్రంప్
  • హర్మూజ్ జలసంధి పూర్తిగా తమ నేవీ నియంత్రణలో ఉందని వెల్లడి
  • నష్టపరిహారం అడిగిన ఇరాన్‌కు ఎదురు డిమాండ్ పెట్టిన అధ్యక్షుడు
  • గత 50 ఏళ్లలో జరిగిన నష్టానికి ఇరానే పరిహారం చెల్లించాలని వ్యాఖ్య
ఇరాన్‌పై భారీ సైనిక చర్య చేపట్టే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. నష్టపరిహారం చెల్లించాలన్న టెహ్రాన్ డిమాండ్‌ను తిరస్కరించడమే కాకుండా, కీలకమైన హర్మూజ్ జలసంధి పూర్తిగా తమ నేవీ నియంత్రణలోనే ఉందని తేల్చిచెప్పారు.

మంగళవారం వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్, ఇరాన్‌తో చర్చల తర్వాత తదుపరి చర్య ఏంటని ప్రశ్నించగా.. "మీకే తెలుస్తుంది" అని రెండుసార్లు సమాధానమిచ్చారు. భారీ సైనిక చర్యకు అవకాశం ఉందా? అని అడగ్గా, "మాకు ఆ సామర్థ్యం ఉంది. మేం చేయాలనుకుంటే చేస్తాం" అని బదులిచ్చారు.

అమెరికా వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేసిందని, అయితే గత 50 ఏళ్లుగా ఇరాన్ చర్యల వల్ల బాధితులైన వారికి టెహ్రానే పరిహారం చెల్లించాలని తాను వాదించినట్లు ట్రంప్ వివరించారు. "నష్టపరిహారం చెల్లించాల్సి వస్తే, ఆ నష్టాన్ని ఇరానే చెల్లించాలి" అని ఆయన అన్నారు.

ప్రస్తుతం హర్మూజ్ జలసంధి తమ పూర్తి నియంత్రణలో ఉందని ట్రంప్ పేర్కొన్నారు. "ఇదొక ఉక్కు గోడ లాంటిది. మేం అనుమతించిన వారిని మాత్రమే లోపలికి రానిస్తాం. ఇరాన్‌కు వెళ్లే నౌకలను మాత్రం అనుమతించడం లేదు" అని ఆయన తెలిపారు. ఇరాన్ ఆర్థికంగా పూర్తిగా దివాలా తీసిందని, పశ్చిమాసియాలొ ఒక ‘బుల్లీ’గా వ్యవహరించిందని ట్రంప్ ఆరోపించారు. 
Advertisement
Donald Trump
Iran
US military action
Strait of Hormuz
US Iran tensions
White House

More Telugu News